కాల్‌ లెటర్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

కాల్‌ లెటర్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు
x
Highlights

సచివాలయ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఎంపికైన అభ్యర్థులు కాల్‌ లెటర్‌లో పేర్కొన్న తేదీల్లో వివిధ కారణాలతో వెరిఫికేషన్‌కు హాజరు...

సచివాలయ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఎంపికైన అభ్యర్థులు కాల్‌ లెటర్‌లో పేర్కొన్న తేదీల్లో వివిధ కారణాలతో వెరిఫికేషన్‌కు హాజరు కాలేకపోయినా, హాజరైనా అన్ని ఒరిజనల్స్‌ చూపలేకపోయినా.. వారికి మరో ఛాన్స్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ డిస్ట్రిక్ట్ సెలక్షన్‌ కమిటీలకు ఆదేశించారు. శనివారం నుంచి ఐదు జిల్లాల్లో షార్టు లిస్టులు విడుదల చేసి, ఎంపికైన అభ్యర్థుల మొబైల్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్, ఈ మెయిల్‌ పద్ధతిలో సమాచారం పంపే కార్యక్రమం చేపట్టినట్టు గిరిజా శంకర్ వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఈ నెల 23, 24, 25 తేదీల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కార్యక్రమం జరగనుందని.. ఏ అభ్యర్థి ఏ రోజు, ఏ ప్రాంతంలో వెరిఫికేషన్‌కు హాజరు కావాలన్నది అభ్యర్థికి పంపే సమాచారంలో ఉంటుందని తెలిపారు. షార్ట్‌ లిస్టులో పేరున్న వారు తమ కాల్‌ లెటర్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories