రానున్న రెండ్రోజుల్లో చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు భారీ వర్ష సూచన

Andhra Pradesh to Receive Heavy Rains in Next Two Days due to low Pressure in Bay of Bengal
x

చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు భారీ వర్ష సూచన(ఫోటో: ది హన్స్ ఇండియా)

Highlights

*రానున్న రెండ్రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం *గుంటూరు, కృష్ణాజిల్లాల తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు, ఈశాన్య రుతువపనాలతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మొన్న తమిళనాడు వద్ద వాయుగుండం తీరం దాటిన అనంతరం చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈసారి కూడా నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాలపైనే తీవ్ర స్థాయిలో ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ నెల 27 నుంచి ఆ నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అనంతపురం జిల్లాతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories