కరవు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ – నిమ్మల రామానాయుడు

కరవు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ – నిమ్మల రామానాయుడు
x

కరవు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ – నిమ్మల రామానాయుడు

Highlights

ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. నీటి వనరుల సద్వినియోగం, వర్షపు నీటి సంరక్షణ, సాగునీటి సరఫరా వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి వెల్లడించారు. రాబోయే వర్షాకాలానికి ముందే రాష్ట్రంలోని జలప్రాజెక్టుల గేట్లను మరమ్మతు చేసి, అవసరమైన చోట కొత్త సదుపాయాలను కల్పించాలని సీఎం ఆదేశించారని ఆయన చెప్పారు. దీంతో సాగునీరు సకాలంలో అందించడమే కాకుండా, వరద నియంత్రణకు కూడా సహాయపడుతుందని వివరించారు.

రాష్ట్రంలో వర్షపాతం తగ్గినా, నీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించుకుంటే కరవు సమస్యను అధిగమించవచ్చని నిమ్మల పేర్కొన్నారు. రైతులకు నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని, భూగర్భ జలాల వినియోగం తగ్గించి వర్షపు నీటిని నిల్వ చేసే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

కరవును శాశ్వతంగా నివారించాలంటే ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. వర్షపు నీటిని వృధా కాకుండా నిల్వ చేయడం, చెరువులను పునరుద్ధరించడం, చెట్లను నాటడం వంటి కార్యక్రమాల్లో ప్రజల సహకారం అవసరమని నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories