AP MLC Elections: కొనసాగుతున్న ఏపీ టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

AP MLC Elections:తూర్పు పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ నియోజవర్గ స్థానం ఓట్ల లెక్కింపు..సాయంత్రంలోపు పూర్తికానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ

Samba Siva Rao
Published on: 17 March 2021 8:56 AM IST
Graduate MLC Elections In Talangana
X

ఎమ్మెల్సీ కౌంటింగ్ (ThehansIndia) 

AP MLC Elections: ఏపీలో రెండు టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. గుంటూరులోని ఏసీ కాలేజ్‌లో.. కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానం ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తూర్పు పశ్చిమ గోదావరి టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో జరుగుతోంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లును ఓపెన్‌ చేశారు కౌంటింగ్‌ సిబ్బంది.

ఇక పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులు ఓపెన్‌ చేయనున్నారు. పోలయిన ఓట్లను కట్టలుగా కడుతున్నారు. ఇక మొత్తం ఓట్లను కట్టలు కట్టడానికి దాదాపు 10 గంటలు పట్టే అవకాశం ఉంది. అయితే.. సాయంత్రంలోపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలుస్తోంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story