Top
logo

డమ్మీ కాన్వాయ్‌తో ట్రయల్‌రన్‌ చేయడం సిగ్గు చేటు: దేవినేని ఉమా

డమ్మీ కాన్వాయ్‌తో ట్రయల్‌రన్‌ చేయడం సిగ్గు చేటు: దేవినేని ఉమా
Highlights

భూములు అమ్ముకోవటానికే జగన్‌ రాజదాని తరలిస్తున్నారు -దేవినేని ఉమా

టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సీఎం జగన్ పైనా, వైసీపీ నేతలపైనా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో భూములు కొట్టేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. అమరావతి జేఏసీ పిలుపు మేరకు రేపు ప్రతి ఒక్కరూ రోడ్లపైకి రావాలని... పిలుపునిచ్చారు. అయితే అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదంటూ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని... ఇలాంటి నోటీసులకు భయపడేది లేదనిస్పష్టం చేశారు. 151 సీట్లు గెలుచుకున్నామని చెప్పుకుంటున్న వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. సమావేశాలు జరుపుకోవడానికి 10 వేల మంది పోలీసులను మోహరించారంటే అంతకంటే సిగ్గుపడాల్సిన విషయం మరొకటి లేదని అన్నారు.


Web TitleAndhraPradesh TDP Leader Devineni Uma Comments on CM Jagan

లైవ్ టీవి


Share it
Top