పంచాయతీ ఎన్నికల బరిలో ఏపీ స్పీకర్‌ తమ్మినేని సతీమణి

Andhra Pradesh Speaker Tammineni Wife in panchayat elections
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

* శ్రీకాకుళం జిల్లా తొగరాంలో వాణి‌శ్రీ నామినేషన్ * మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నట్టు వెల్లడి * ఎవరు మంచి చేస్తారని భావిస్తే, ప్రజలు వారికే ఓటు వేస్తారు -వాణిశ్రీ

ఈ ఊరు నిమ్మాడ కాదు తొగరాం ఇక్కడ ఎటువంటి గొడవలు జరగవు. ఎప్పుడూ ప్రశాంతంగానే ఎన్నికలు జరుగుతాయని అన్నారు ఏపీ స్పీకర్‌ సతీమణి తమ్మినేని వాణిశ్రీ. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని స్పీకర్‌ స్వగ్రామమైన తొగరాంలో మద్దతుదారులతో వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు వాణిశ్రీ. తాను మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నట్టు ఆమె చెప్పారు. గెలుపు, ఓటములు దేవాదీనమని, ప్రజలు ఎవరు మంచి చేస్తారని భావిస్తే, వారికే ఓటు వేస్తారని స్పష్టం చేశారు వాణిశ్రీ.

Show Full Article
Print Article
Next Story
More Stories