ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పై ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు..

ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పై ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు..
x
Tammineni Sitaram (File Photo)
Highlights

లాక్‌డౌన్ కారణంతో ఏపీలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. రాష్ట్రంలో నాటు సారా తయారీ మొదలైంది.

లాక్‌డౌన్ కారణంతో ఏపీలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. రాష్ట్రంలో నాటు సారా తయారీ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు సారా తయారీ గుడారాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఉక్కుపాదం మోపుతున్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సారా బట్టీలను సీజ్ చేశారు. ఈ నేపధ్యంలో సారా తయారీపై స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నాటు సారా ఏరులై పారుతోందని, అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు నిద్రపోతున్నారా అంటూ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటు సారా తయారీ విచ్చలవిడిగా సాగుతోందని కొందరు తన దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారని అన్నారు. నాటుసారా మాఫియాతో కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతున్నారని ,ఈ ముఠాలు సమాజాన్ని కంట్రోల్ చేసే స్థితికి చేరుకుంటున్నాయని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా గంజాయి, విచ్చలవిడిగా నిషేధిత గుట్కాలు దొరుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి నాటుసారా కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. స్పీకర్ తమ్మినేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీలో సంచలనం రేపుతున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories