ఎన్నికల కోడ్ అమల్లో లేదు : ఎస్‌ఈసీ నిమ్మ‌గ‌డ్డ

ఎన్నికల కోడ్ అమల్లో లేదు : ఎస్‌ఈసీ నిమ్మ‌గ‌డ్డ
x
SEC Nimmagadda Ramesh Kumar
Highlights

క‌రోనా వైర‌స్ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తి కుంటుంబానికి వెయ్యి రూపాయ‌లు అర్థిక సాయం పంపిణీ చేస్తుంది.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తి కుంటుంబానికి వెయ్యి రూపాయ‌లు అర్థిక సాయం పంపిణీ చేస్తుంది. ఈ నేప‌థ్యంలో న‌గ‌దు సాయం వైసీపీ నేత‌లు ఇస్తున్నారంటూ ప్ర‌తిప‌క్షాలు పై విమ‌ర్శ‌లు గుప్తిస్తున్నాయి. బీజేపీ, సీపీఐ పార్టీలు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీనిపై రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ స్పందించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో లేద‌ని, ప్ర‌చారాల‌పై నిషేదం ఉంద‌ని తెలిపారు.

ప్రస్తుత సంధికాలంలో ఎన్నిక‌ల‌ ప్రచారంపై నిషేధం కొనసాగుతోందని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్యర్థులు స్వప్రయోజనాల ఓటర్లను ప్రభావితం చర్యలు చేయకూడదన్నారు.ద ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయాల‌ని చూస్తే ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అధికారులు ఇలాంటి ఘ‌ట‌న‌ల‌పై దృష్టిసారించాలని ఆయన ఆదేశించారు. వాస్త‌వాలు విచారించి త‌మ‌ దృష్టికి తీసుకురావాలని ఆయ‌న‌ సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులకు ర‌మేశ్ కుమార్ లేఖ రాశారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు స్వప్రయోజనాల న‌గ‌దు పంచుతూ.. ఓట‌ర్లు ప్ర‌భావితం చేస్తున్న‌ట్లుగా.. త‌మ‌కు ఫిర్యాదులు వచ్చాయని రమేశ్‌కుమార్‌ చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ త‌మ‌ దృష్టికి తీసుకొచ్చార‌ని ర‌మేశ్ కుమార్ పేర్కొన్నారు. గ‌త నెల‌లో జ‌ర‌గాల్సిన స్థానిక ఎన్నిక‌లు క‌రోనా కార‌ణంగా వాయిదా వేస్తున్న‌ట్లు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ర‌మేశ్ కుమార్ తెలిపారు. ఎన్నిక‌లు ఆరు వారాలు వాయిదా వేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. దీనిపై ప్ర‌భుత్వం కోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories