Andhra Pradesh: మే 10 నుంచి రేషన్ షాపుల బంద్

Rations Shops Closed May 10th
x

రేషన్ షాపు ఫైల్ ఫోటో 

Highlights

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 10వ తేదీన రేషన్ షాపుల బంద్ చేప‌ట్టనున్నాయి.

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 10వ తేదీన రేషన్ షాపుల బంద్ చేప‌ట్టనున్నాయి. ఈ మేర‌కు రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మండాది వెంకట్రావు వెల్ల‌డించారు. రేషన్ డీలర్లపై అధికారుల వైఖరీకి నిరసనగా ఈ బంద్ చేప‌డుతున్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశాడు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న రేషన్ పంపిణీ విధానంలో ప్రభుత్వం లోపాలను సరి చేయాలని చెప్పారు. రాష్ట్రంలో సగం మంది ఎండీయీలు రేషన్ పంపిణీ చేయడం లేదన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న డోర్ డెలివరీ రేషన్ పంపిణీపై విజిలెన్స్ ఎంక్వయిరీ వేయాలని దీనిలో ఉన్న లోపాలను ముఖ్యమంత్రి జగన్ గుర్తించాలని చెప్పారు. ఎండీయూలు చేయాల్సిన పంపిణీని డీలర్లు చేయాలని వత్తిడికి గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న డీలర్లను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్స్ వేయించి, డీలర్లకు భీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని వెంకట్రావు విజ్ఞ‌ప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories