జీరో ఎఫ్‌ఐఆర్‌ అమలుకు సిద్ధమైన ఏపీ పోలీస్‌శాఖ

జీరో ఎఫ్‌ఐఆర్‌ అమలుకు సిద్ధమైన ఏపీ పోలీస్‌శాఖ
x
AP DGP File Photo
Highlights

-ఢిల్లీ, ముంబాయ్‌ తరహాలో ఏపీలో అమలుకు డీజీపీ ఆదేశం -మార్గదర్శకాలు తయారు చేసే పనిలో ఉన్నతాధికారులు

దిశ ఘటనతో దేశంలోని పలు నగరాలు అప్రమత్తమయ్యాయి. జీరో ఎఫ్‌ఐఆర్‌ అమలుకు ఏపీ పోలీస్‌శాఖ సిద్ధమవుతోంది. ఢిల్లీ, ముంబాయ్‌ తరహాలో ఏపీలో అమలుకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలు జారీ చేశారు. మార్గదర్శకాలు తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే జీరో ఎఫ్‌ఐఆర్‌ పై ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలు,పోలీస్‌ ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. జీరో ఎఫ్‌ఐఆర్‌ను నిర్లక్ష్యం చేస్తే అధికారులపై శాఖాపరమైనచర్యలకు కూడా వెనుకాడబోమని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ వల్ల పోలీసులకు టెక్నికల్‌ ఇబ్బందులున్నా.. వాటిని ప్రజల కోసం అధిగమిస్తామన్నారు డీజీపీ సవాంగ్‌.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories