విశాఖ గ్యాస్‌ లీకేజీ బాధితులకు పరిహారం అందజేసిన మంత్రులు

విశాఖ గ్యాస్‌ లీకేజీ బాధితులకు పరిహారం అందజేసిన మంత్రులు
x
AP Ministers Avanthi Srinivas, Kanna babu
Highlights

విశాఖలో విష‌వాయులు లీకేజీ దుర్ఘ‌ట‌న‌లో బాధితుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌రిహారాన్ని సోమ‌వారం పంపిణీ చేశారు.

విశాఖలో విష‌వాయులు లీకేజీ దుర్ఘ‌ట‌న‌లో బాధితుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌రిహారాన్ని సోమ‌వారం పంపిణీ చేశారు. సమీపంలో‌ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ ప్ర‌మాదంలో 12మంది మృతి చెంద‌గా ప‌లువురు అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన ఘ‌న‌ట తెలిసిందే. బాధితుల‌కు ప్ర‌భుత్వం అదుకుంటుంద‌ని సీఎం జ‌గ‌న్ హామి ఇచ్చారు. మృతుల కుటుంబాల‌కు కోటి రూపాయ‌లు ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు.

విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులను ఇవాళ‌ మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కన్నబాబు, బొత్స సత్యనారాయణ పరామర్శించారు. మృతి చెందిన వారిలో నలుగురు కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.కోటి చెక్కులు అందజేశారు.

అనంత‌రం మంత్రి క‌న్న బాబు మాట్లాడుతూ ' ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ప్రజలంతా ధైర్యంగా ఉండాల్నారు. గ్యాస్‌ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి ప్రస్తుతం అదుపులోకి వచ్చిందని తెలిపారు. పలు గ్రామాల్లో శానిటైజేషన్‌‌ పనులు చేపట్టామని నాలుగు గంటల తర్వాత ప్రజలను గ్రామాల్లోకి అనుమతిస్తామని మంత్రి తెలిపారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు మంత్రులంతా ఒక్కొక్కరు ఒక్కో గ్రామంలో ఇవాళా బస చేయ‌నున్న‌ట్లు తెలిపారు. విశాఖ ఘటనతో రాష్ట్రంలో పారిశ్రామిక భద్రతకు సంబంధించిన విధానాన్ని తీసుకురావాల‌ని సీఎం భావిస్తున్నార‌ని మంత్రి వెల్ల‌డించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories