బ్లీచింగ్ కొనుగోళ్ళలో అక్రమాలు అవాస్తవం : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

బ్లీచింగ్ కొనుగోళ్ళలో అక్రమాలు అవాస్తవం : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
x
Peddireddy Ramachandra Reddy (File Photo)
Highlights

లాక్ డౌన్ కారణంగా నిత్యం ఈ సామగ్రిని అందించే సరఫరాదారులు మెటీరియల్ అందించలేక పోతున్నారనే విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చరని తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా నిత్యం ఈ సామగ్రిని అందించే సరఫరాదారులు మెటీరియల్ అందించలేక పోతున్నారనే విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చరని తెలిపారు. దీనితో రాష్ట్రంలో పారిశుధ్య అవసరాలకు ఉపయోగించే, నిర్ధేశిత ప్రమాణాలు వున్న బ్లీచింగ్, కాల్షియం హైడ్రాక్సైడ్ పైన్ ఆయిల్ వంటివి రాష్ట్రంలో అందించే ఇతర సంస్థల నుంచి నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

జిల్లాస్థాయిలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో సదరు పారిశుధ్య మెటీరియల్ ను పరిశీలించి, సహేతుకమైన ధరకు కొనుగోలు చేసేందుకు అధికారాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆ తరువాత సదరు మెటీరియల్ ను, జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ పర్చేసింగ్ కమిటీ (డిపిసి) నిర్ణయించిన ధరకు జిల్లా పంచాయతీ అధికారులు కొనుగోలు చేస్తారని తెలిపారు.

కోవిడ్ -19 పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకుని అందుబాటులో వున్న సంస్థల నుంచి పారిశుధ్య మెటీరియల్ ను కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఈ కొనుగోళ్లు జరిపామని వెల్లడించారు. అదే క్రమంలో సదరు మెటీరియల్ నాణ్యత, పరిమాణాలను డిఓపిలు పరిశీలించాలని కూడా మార్గనిర్ధేశం చేశామని అన్నారు. దీనికి అనుగుణంగానే రాష్ట్రంలో పారిశుధ్య మెటీరియల్ కొనుగోళ్ళు జరిగాయని అన్నారు. ఇందులో ఎటువంటి అవినీతి, అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో వంద కోట్ల రూపాయలతో నాణ్యతలేని బ్లీచింగ్ ను ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ వస్తున్న విమర్శలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రటకనలో ఖండించారు. కొన్ని పత్రికలు వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలను ప్రచురించాయని అన్నారు. నాణ్యత లేని బ్లీచింగ్ ను కొనుగోలు చేశారంటూ పత్రికల్లో వచ్చిన వార్తలపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఈ నెల పదిహేనో తేదీన అన్ని జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించామని తెలిపారు.

ఈ మేరకు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు చెందిన అధికారులు గుంటూరుజిల్లా పిడుగురాళ్ళకు చెందిన మెస్సర్స్ డిలైట్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బ్లీచింగ్ పౌడర్, కాల్షియం హైడ్రాక్సైడ్ పైన్ ఆయిల్ కొనుగోలు చేసినట్లు వెల్లడయ్యిందని అన్నారు. దీనిలో కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లా అధికారులు కోటీ పదకొండు లక్షల ఏడువేల తొంబై నాలుగు (1,11,07,094) రూపాయల విలువైన బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేశారని తెలిపారు.

ఈ మొత్తంలోనూ సదరు సంస్ధకు రూ. 43.20 లక్షలు మాత్రమే చెల్లింపులు జరిగాయని అన్నారు. ఇంకా చెల్లించాల్సిన మొత్తం 67,87,094 రూపాయలు అని వెల్లడించారు. అంటే ఈ సంస్ధ నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన మొత్తం బ్లీచింగ్ పౌడర్ విలువ 1,11,07,094 రూపాయలు అయితే దానిని వంద కోట్ల రూపాయల మేర కొనుగోళ్ళు జరిగాయంటూ కొన్ని పత్రికలు తప్పుడు వార్తలను అతిశయోక్తిగా ప్రచురించాయని అన్నారు.

నెల్లూరు, గుంటూరు జిల్లాలకు డిలైట్ కెమికల్స్ సరఫరా చేసిన బ్లీచింగ్ పౌడర్ పై నాణ్యతకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, దానిపై పూర్తి నివేదిక కోసం నమూనాలను ల్యాబ్ కు పంపించామని తెలిపారు. ఈ నివేదికలు వచ్చే వరకు సదరు సంస్థకు చెల్లింపులు నిలిపివేశామని వెల్లడించారు.

డిలైట్ కెమికల్స్ నుంచి మిగిలిన అయిదు జిల్లాలు ఎటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేయలేదని తెలిపారు. విజయనగరం, and కృష్ణ, గుంటూరు జిల్లాలు కేవలం 4,79,86,410 రూపాయల విలువైన కాల్షియం హైడ్రాక్సైడ్, పైన్ ఆయిల్ మాత్రమే కొనుగోలు చేశాయని తెలిపారు. ఇందుకు గానూ సదరు సంస్ధకు రూ.31,49,653 రూపాయలు చెల్లించామని, ఇంకా 4,48,36,757 రూపాయలు చెల్లించాల్సి వుందని తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలకు అనుగుణంగా కరోనా పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను ప్రతిరోజూ పంచాయతీరాజ్ అధికారులతో టెలి, వీడియో కాన్ఫెరెన్స్ ల ద్వారా సమీక్షిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లాల్లో ఏడు నుంచి పదిరోజులకు సరిపడే పారిశుధ్య సామగ్రి అందుబాటులో వుందని అధికారులు నివేదించారని అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories