నా మాటలు వెనక్కి తీసుకుంటున్న... బాధించి ఉంటే క్షమించండి : ఏపీ డిప్యూటీ సీఎం

నా మాటలు వెనక్కి తీసుకుంటున్న... బాధించి ఉంటే క్షమించండి : ఏపీ డిప్యూటీ సీఎం
x
Narayana swamy
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి కారణం అంటూ.. మర్కజ్ సమావేశాలకు వెళ్లి వచ్చిన ముస్లింలపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ వ్యాప్తి కారణం అంటూ.. మర్కజ్ సమావేశాలకు వెళ్లి వచ్చిన ముస్లింలపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో నిజాముద్దీన్ తబ్లిగి మర్కజ్‌కు వెళ్లొచ్చినవారిపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని, మాటలు ఏవైనా బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ట్విట్టర్ ద్వారా తెలిపారు.

కరోనా నుంచి అందరూ బయటపడాలనే ఉద్దేశ్యంతోనే ఢిల్లీ మత ప్రార్ధనల నుంచి తిరిగి వచ్చిన వారు, వారితో కలిసి మెలిగిన వారు పరీక్షులు చేయించుకుని, వైద్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు నారాయణ స్వామి వివరించారు.

అంతకముందు లాక్‌డౌన్‌తో దేశ ప్ర‌జ‌లంతా ఇళ్లకే పరిమితమైతే.. వీళ్లు మాత్రం ఢిల్లీల్లో ఫంక్షన్ల చేసుకొని, ప్లేట్లు, స్పూన్లు నాకుతూ.. వైరస్ అంటిస్తున్నారని నారాయణ స్వామి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ముస్లింలు కరోనా పాజిటివ్ ఉన్న కూడా డాక్టర్లకు సహకరించడం లేదని, సామాజిక దూరాన్ని పాటించడం లేదన్నారు. ఇప్పటికైనా వారు పద్దతి మార్చుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో కొన్ని వర్గాల నుంచి విమర్శలు తలెత్తడంతో మంత్రి తన తన కామెంట్స్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది

Show Full Article
Print Article
Next Story
More Stories