ఏపీ మంత్రికి కరోనా పరీక్షల్లో నెగిటివ్

ఏపీ మంత్రికి కరోనా పరీక్షల్లో నెగిటివ్
x
Anil Kumar Yadav (File Photo)
Highlights

క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు ఏపీలో రోజురోజుకు భారీ సంఖ్య‌లో పెరిగిపోతున్నాయి.

క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు ఏపీలో రోజురోజుకు భారీ సంఖ్య‌లో పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో మూడు వంద‌ల‌పైగా కేసులు న‌మోదైయ్యాయి. దీంతో రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు ముందు జాగ్ర‌త్త‌గా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నారు.

నెల్లూరు జిల్లాలో కేసులు ఒక్క‌సారిగా పెరిగిపోవ‌డంతో ఆ ప్రాంతానికి చెందిన రాష్ట్ర ఇరిగేష‌న్ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నార‌ని టాక్ . అలాగే 36 గంటలపాటు స్వీయ నిర్బంధంలో ఉన్నారట. కరోనా పరీక్ష నెగెటివ్‌ రావడంతో మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 5న నెల్లూరుకు చెందిన ఓ డాక్ట‌ర్ కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఈ వైద్యుడు తన ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మంత్రి అనిల్ కుమార్‌ను ఆహ్వానించారట. దీంతో ముందస్తు జాగ్రత్తగా మంత్రి స్వచ్ఛందంగా కరోనా టెస్ట్‌ చేయించుకున్నారట. ఆదివారం స్వాబ్ తీసి స్వీమ్స్ పంపారు.

సోమ‌వారం రాత్రికి నెగిటివ్ రావ‌డంతో తిరిగి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టినే నెల్లూరు జిల్లాలో కరోనా బాధితులున్న ప్రాంతాలు, రెడ్‌జోన్లలో పర్యటించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్య‌ధిక కేసులు నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories