AP Mana Badi Nadu-Nedu : ప్రభుత్వ విద్యా వ్యవస్థకు జవసత్వాలు

AP Mana Badi Nadu-Nedu : ప్రభుత్వ విద్యా వ్యవస్థకు జవసత్వాలు
x
Highlights

AP Mana Badi Nadu-Nedu: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టింది.

AP Mana Badi Nadu-Nedu: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టింది. అంతేకాదు ప్రభుత్వ విద్యా వ్యవస్థకు జవసత్వాలు వస్తున్నాయి. ఈ ఏడాది నాడు - నేడు కార్యక్రమం కింద వేలాది పాఠశాలలను ఆధునీకరిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే చాలా చోట్ల దాదాపు పనులు పూర్తయ్యాయి. ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న పాఠశాల కృష్ణాజిల్లాలోని కంకిపాడు మండలంలోని కోలవెన్నులోనిది. ప్రస్తుతం నాడు నేడు ద్వారా శిధిలమైన బ్రిటిషువారి కాలం నాటి పాఠశాలను ఆధునీకరిస్తున్నారు.. పాఠశాల ఆధునీకరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. కాగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒకటైన 'నాడు-నేడు' కార్యక్రమాన్ని గతేడాది ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.

మూడేళ్ల కాలంలో మూడు దశల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం రూ.12,000 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. మొదటి దశ కింద 15715 పాఠశాలల్లో 9 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇందుకోసం రూ.3627కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఇక ప్రతి విడతలో నాడు–నేడు కింద గ్రామీణ, గిరిజన, మున్సిపాల్టీల్లో స్కూళ్లు ఉండేలా చూసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆ మేరకే ప్రణాళిక తయారు చేయాలన్నారు. స్కూలు యూనిఫారాల దగ్గర నుంచి ఫర్నిచర్‌ వరకూ నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories