జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి అరెస్ట్‌

జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి అరెస్ట్‌
x
Highlights

జూదం కేసులో జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి అరెస్ట్ అయ్యారు.

జూదం కేసులో జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి అరెస్ట్ అయ్యారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అతను నిడమర్రు మండల బావాయిపాలెంకు చెందిన మైలవరపు సురేంద్రగా తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బావాయిపాలెం గ్రామ శివారులోని చేపల చెరువు షెడ్‌ వద్ద 10 మంది కలిసి పేకాట ఆడుతున్నారు..

అయితే సమాచారం అందుకున్న పోలీసులు వారందర్ని అదుపులోకి తీసుకున్నట్లు నిడమర్రు ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. వీరి నుంచి రూ.79,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో మైలవరపు సురేంద్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అతను నిడమర్రు జనసేన జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories