Andhra Pradesh: రఘురామ పిటిషన్ కొట్టేయండి : జగన్

Andhra Pradesh: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.

Kranthi
Published on: 1 Jun 2021 12:32 PM IST
Andhra Pradesh: Jagan Filed Counter in CBI Court
X

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజు వేసిన పిటిషన్ పై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో కౌంరట్ దాఖలు చేసిన జగన్ బెయిన్ షరతులు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు.

రఘురామ పిటిషన్ కు విచారణార్హత లేదని వ్యక్తిగత, రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన పిటిషన్ ను కొట్టివేయాలని సీబీఐ కోర్టును జగన్ కోరారు. మరో వైపు సీబై కూడా న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. రఘురామ పిటిషన్ పై చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పేరొకంది. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.

Kranthi

Kranthi

Next Story