
రాష్ట్రంలో పాజిటిక్ కేసులు సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ సీఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో పాజిటిక్ కేసులు సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ సీఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో కంటే ఏపీలోనే అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని అందుకే ఎక్కువ కరోనా పరీక్షలు వస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80,334 మందికి టెస్టు లు నిర్వహించినట్లు వెల్లడించారు. వీరిలో 1,259 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారించినట్లు చెప్పారు. కరోనా నివారణ చర్యల్లో రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉందన్నారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే పాజిటివ్ రేట్ తక్కువగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా పాజిటివ్ రేటు 4.13గా ఉందని, ఏపీలో పాజిటివ్ రేటు 1.57 మాత్రమే ఉందన్నారు. గుజరాత్ లో 6.62 , తమిళనాడులో 2.2, మహారాష్ట్ర పాజిటివ్ రేటు 7.46, మధ్యప్రదేశ్‌లో 8.44 ఉందన్నారు. తమిళనాడులో 10 లక్షల మందికి 1,103 పరీక్షలు, రాజస్థాన్‌లో 1,077 పరీక్షలు చేశారన్నారుదేశంలో సగటున ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1,504 పరీక్షలు చేస్తూ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని జవహర్‌రెడ్డి తెలిపారు. రెడ్‌జోన్ల పరిధిలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి అనితెలిపారు.
ఇవాళ ఒక్కరోజు 82 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,259కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందారు. 258 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




