జగన్ సర్కార్ తొలిగించిన అధికారికి కేంద్రంలో పదోన్నతి

జగన్ సర్కార్ తొలిగించిన అధికారికి కేంద్రంలో పదోన్నతి
x
Krishna Kishore (File Photo)
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధుల నుంచి తొలిగించి కేసు నమోదు చేసిన ఐఆర్ఎస్ (IRS)అధికారి కృష్ణ కిశోర్‌కు కేంద్రంలో పదోన్నతి లభించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధుల నుంచి తొలిగించి కేసు నమోదు చేసిన ఐఆర్ఎస్ (IRS)అధికారి కృష్ణ కిశోర్‌కు కేంద్రంలో పదోన్నతి లభించింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికాభివృద్ధి బోర్డు సీఈఓగా పనిచేశారు. అయితే అధికారంలో ఉండగా కృష్ణకిషార్ అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. అనంతరం కృష్ణకిషార్ పై కేసులు కూడా నమోదయ్యాయి.

అయితే దీనిపై కృష్ణ కిషోర్ క్యాట్‌ను ఆశ్రయించడంతో... సస్పెన్షన్‌పై క్యాట్ స్టే విధించింది. దాంతో ఆయన రాష్ట్ర సర్వీసుల నుంచి కేంద్రానికి రిపోర్ట్ చేశారు. కాగా.. కృష్ణకిశోర్‌కు జాయిన్ అయిన వెంటనే పదోన్నతి కల్పించింది. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా కృష్ణకిశోర్‌కు పదోన్నతి కల్పిస్తూ సీబీడీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ ప్రధాన కార్యాయలయంలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories