ఏపీ ప్రభుత్వానికి హై కోర్టులో షాక్

ఏపీ ప్రభుత్వానికి హై కోర్టులో షాక్
x
Representational Image
Highlights

జగన్ సర్కార్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.

జగన్ సర్కార్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గ్రానైట్‌ క్వారీల యజమానులకు నోటీసుల జారీ విషయంలో చుక్కెదురైంది. గుంటూరు జిల్లాలో గ్రానైట్‌ వ్యాపారులకు 2500 కోట్ల రూపాయలు జరిమానా విధిస్తూ గనులు, భూగర్భ శాఖ గతంలో ఇచ్చిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది.

అయితే ఇటీవల క్వారీలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై క్వారీ యజమాని హైకోర్టును ఆశ్రయించారు. లాక్‌డౌన్‌తో గ్రానైట్‌ క్వారీలు మూతపడిన విషయాన్ని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.

నోటీసులకు ఇప్పటికిప్పుడే యజమానులు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. గతంలో ఇదే విషయంలో ఒక తీర్పు ఇచ్చాం.. పైగా ప్రస్తుతం లాక్‌డౌన్‌తో పరిశ్రమ మూసివేసి ఉంది. ఇప్పుడు జరిమానాలు విధించడం ఏంటి? అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. లాక్‌డౌన్‌ ఎత్తివేసి పరిశ్రమ గాడిలో పడిన తర్వాత విచారణ చేయొచ్చని తేల్చి చెప్పినట్లు తెలిసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories