AP Apex court CJ Offers Prayers: శ్రీవారి, అమ్మవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

AP Apex court CJ Offers Prayers
AP Apex court CJ Offers Prayers: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె కె మహేశ్వరి శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు
AP Apex court CJ Offers Prayers: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె కె మహేశ్వరి శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఈఓ సింఘాల్ ప్రధాన న్యాయమూర్తికి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్ర నాధ్ పాల్గొన్నారు.
అమ్మవారి సేవలో....
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె కె మహేశ్వరి శనివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ముందు అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, ఆలయ డిప్యూటి ఈఓ శ్రీమతి ఝాన్సి, అర్చకులు బాబు స్వామి ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు జె కె మహేశ్వరికి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఎస్పీ రమేష్ రెడ్డి ప్రధాన న్యాయమూర్తి కి స్వామివారి చిత్రపటం అందించి శాలువతో సత్కరించారు. జిల్లా జడ్జి రవీంద్ర బాబు, న్యాయమూర్తులు పవన్, ధనుంజయులు నాయుడు పాల్గొన్నారు.