రాజధాని భూములపై రైతులకు ఏలాంటి ఆందోళన అవసరం లేదు

రాజధాని భూములపై రైతులకు ఏలాంటి ఆందోళన అవసరం లేదు
x
మంత్రి పేర్ని నాని
Highlights

ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధానిపై హైపవర్ కమిటీ ఏర్పాటుకు అనుమతించింది. స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంది.

ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధానిపై హైపవర్ కమిటీ ఏర్పాటుకు అనుమతించింది. స్థానిక ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారు చేసింది. 341 వ్యవసాయ ఉత్పత్తుల శాశ్వత కొనుగోలు కేంద్రాలు నడపాలని కేబినెట్ నిర్ణయించింది.

రాజధాని భూములపై రైతులకు ఏలాంటి ఆందోళన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పేర్ని నాని భరోసా ఇచ్చారు. రాజధానిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికపై హైపవర్ కమిటీ ఏర్పాటుకు మంత్రి మండలి నిర్ణయించింది. మంత్రులు, సీనియర్ ఐఏఎస్‌ అధికారులతో హైపవర్ కమిటీ రాబోతోంది. జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రి వర్గంలో చర్చించారు. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వరామకృష్ణ కమిటీ నివేదికను కూడా మంత్రివర్గ సమావేశంలో అధ్యయనం చేసినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదించింది. ఈ ఎన్నికల్లో ఎస్టీలకు 4శాతం, ఎస్సీలకు 19.08 శాతం, బీసీలకు 38శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మచిలీపట్నం ఓడ రేవు రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించింది. 71కోట్ల 48 లక్షల రూపాయలతో 412.. 108 వాహనాల కొనుగోలు కోసం, 60కోట్ల 51 లక్షల రూపాయలతో 656.. 104 వాహనాల కొనుగోలుకు అనుమతించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీ ఎ‍న్నికలు నిర్వహించే దిశగా చర్చలు జరిగినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్‌ చట్టం 1994 ప్రకారం తీర్మానం చేశామని వెల్లడించారు.

341 వ్యవసాయ ఉత్పత్తుల శాశ్వత కొనుగోలు కేంద్రాలు 365 రోజులు తెరిచి ఉండేలా మంత్రి మండలి తీర్మానించింది. పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్య పంటలకు మద్దతు ధర ముందే ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి తీర్మానించింది. కడప జిల్లా రాయచోటిలో నాలుగు ఎకరాల భూమిని వక్ఫ్‌బోర్డుకు బదలాయిస్తూ నిర్ణయించింది. మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌ తయారీకి రైట్స్‌ నిర్మాణ సంస్థకు అప్పగిస్తూ నిర్ణయించారు. రామాయపట్నం పోర్టును త్వరలో నిర్మాణం చేపట్టేలా మంత్రి వర్గం తీర్మానించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories