logo
ఆంధ్రప్రదేశ్

AP Health Minister Alla Nani: దేవుడిని రాజకీయాల కో్సం వాడుకోవడం తగదు..

AP Health Minister Alla Nani: దేవుడిని రాజకీయాల కో్సం వాడుకోవడం తగదు..
X
Highlights

AP Health Minister Alla Nani | దేవాలయాలను, దేవుడిని రాజకీయాలు కోసం వాడు కోవడం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుది నీచమైన దుర్మార్గమైన ఆలోచన అని, లోపల పూజలు చేయాలి..

AP Health Minister Alla Nani | దేవాలయాలను, దేవుడిని రాజకీయాలు కోసం వాడు కోవడం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుది నీచమైన దుర్మార్గమైన ఆలోచన అని, లోపల పూజలు చేయాలి...బయట నిరసనలు తెలపాలని చంద్రబాబు నాయుడు ఎలా పిలుపు నిస్తాడని ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రశ్నించారు... ఇదేనా హిందూ మతం, ఆలయాల పట్ల చంద్రబాబు నాయుడుకు ఉన్న గౌరవం? చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున ఆలయాలను ధ్వంసం చేసినప్పుడు సిబిఐ విచారణ చేయించారా? రాష్ట్రములోకి సిబిఐ రాకూడదని జీఓ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది, పశ్చిమగోదావరి జిల్లా కె పెంటపాడులో శ్రీ గోపాలస్వామి ఆలయ దివ్య రధం2017అక్టోబర్ 19న చంద్రబాబు హయాంలో దగ్ధమైనప్పుడు దీనిపై ఎందుకు విచారణ చేపట్టలేదని, బాద్యులను ఎందుకు గుర్తించలేదని మంత్రి ఆళ్ల నాని ప్రశ్నించారు..

ఏలూరు నుండి శనివారం మంత్రి ఆళ్ల నాని ఒక ప్రకటన విడుదల చేశారు... 2017లో రధం ఘటన నిదర్శనాలు, రథానికి సంబందించి పునర్నిర్మించడానికి ఒక్క రూపాయి కూడ ప్రభుత్వం కేటాయించలేదు. స్థానికులు అంతా కలిసి సుమారుగా 30లక్షలు పోగుచేసుకొని రధాన్ని ఏర్పాటు చేసుకున్నారు.. ఇది వాస్తవమా.. కాదా? గుళ్లల్లో పూజలు చేసి నిరసన తెలపాలని టీడీపి వాళ్ళు అంటున్నారు.. ఏ గుడిలో నైనా శాంతి భద్రతల సమస్య వచ్చినా, భక్తులకు ఎటువంటి ఆటంకం కలిగించినా ప్రభుత్వం ఉపెక్షించదని మంత్రి ఆళ్ల నాని అన్నారు... టిడిపి పాలనలో ఎన్ని ఘటనలు జరిగినా సిబిఐ విచారణకు దైర్యం లేదు... దమ్ము ధైర్యం చిత్త శుద్ధి ఉంది కాబట్టి మా ప్రభుత్వం అంతిర్వేది ఘటనను సిబిఐకి అప్పగించింది.. మా ప్రభుత్వంలో ఏదయినా పారదర్శికంగా జరుగుతుంది..

రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత ప్రతి పక్షాలకు లేదా? దేవుడికి రాజకీయాలకు ముడి పెట్టడం ఎంత మాత్రం మంచిది కాదు... రాష్ట్రములో దేవాలయాలు వద్ద నిరసనలు తెలియజేయాలి అంటూ ప్రతి పక్ష నేత పిలుపు నివ్వడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నట్టు మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.. చంద్రబాబు నాయుడు హయాంలో విజయవాడలో పెద్ద ఎత్తున ఆలయాలను ధ్వంసం చేశారు.. పుష్కరాల సమయంలో చంద్రబాబు వల్ల 29మంది దారుణంగా చనిపోయారు దీనిపై విచారణకు డిమాండ్ చేసిన ఆనాడు చంద్రబాబు నాయుడు అంగీకరించలేదు.. ఇప్పుడు అంతర్వేది రధం దగ్ధం ఘటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి చిత్త శుద్ధితో చర్యలు తీసుకున్నారు.. అలక్ష్యం వహించిన ఆలయ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు..

ఇంకా ప్రజల్లోఉన్న అపోహలను తొలగించడం కోసం , హిందువు దేవాలయాలు పట్ల ఈ ప్రభుత్వంకు చిత్త శుద్ధిని నిరూపించుకోవడానికి సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు... రాష్ట్రములో అక్కడక్కడా జరుగుతున్న చెదురు మదురు సంఘటనలు వల్ల శాంతి భద్రతలకు విఘాతం రాకూడదని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి పట్టుదలతో వేగంగా చర్యలు తీసుకున్నారు... రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక కేంద్రాలు వద్ద ఎటువంటి సంఘటనలు జరగడానికి వీలు లేదని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ఏపి డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నపుడు ఒకలా... తర్వాత ఒకలా.. మాట్లాడుతున్నారు.. ఆయన అధికారంలో ఉన్నపుడు దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అన్నారు... ఇప్పుడు దళితులు గురుంచి ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు..

చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా దళితులపై జరిగిన దాడులపై పటిష్టమైన చర్యలు తీసుకున్నారా? దళితులను తన రాజకీయ అవసరాలు కోసం వాడుకున్నవ్యక్తి చంద్రబాబు నాయుడు.. నిన్ననే రాష్ట్రములో మహిళ లోకానికి ఒక పండుగ.. 9లక్షల పొదుపు సంఘాలకు దాదాపుగా 27వేల కోట్లు వైస్సార్ ఆసరా పధకం కింద ప్రభుత్వం ఇచ్చేo దుకు సంకల్పించింది.. దాదాపుగా 90లక్షల మంది మహిళలకు లబ్ది చేకూర్చడానికి ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి 689కోట్లు 89లక్షలు రూపాయలు బటన్ నొక్కి మహిళలు ఖాతాల్లో పడేలా కార్యక్రమన్ని ప్రారంభం చేసినట్టు మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు...

Web TitleAndhra Pradesh Health Minister Alla Nani Fire on Chandrababu Naidu
Next Story