Ananthapur Fire Accident: అనంతపురం అగ్ని ప్రమాదంపై మంత్రి ఆరా.. సహాయక చర్యలపై ఆళ్ల నాని ఆదేశం

Ananthapur Fire Accident: అనంతపురం అగ్ని ప్రమాదంపై మంత్రి ఆరా.. సహాయక చర్యలపై ఆళ్ల నాని ఆదేశం
x

Ananthapur Fire Accident

Highlights

Ananthapur Fire Accident: వరుస అగ్ని ప్రమాదాలతో రెండు తెలుగు రాష్ట్రాలు హడలి పోతున్నాయి.

Ananthapur Fire Accident: వరుస అగ్ని ప్రమాదాలతో రెండు తెలుగు రాష్ట్రాలు హడలి పోతున్నాయి. ఒకదాని తరువాత మరొకటి గ్యాప్ లేకుండా వస్తుండటంతో ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి అనంతపురం ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంతో మరింత ఆందోళన నెలకొంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా అధికారులతో పాటు మంత్రి ఆళ్ల నాని తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకున్నారు.

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి 12 గంటల సమయంలో కొవిడ్‌ వార్డులో ఉన్న రికార్డు రూమ్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.ఆ రికార్డు రూమ్‌ పక్కనే 24 మంది కొవిడ్‌ బాధితులు ఉన్నారు.. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ముందస్తు జాగ్రత్తగా రోగుల్ని నుంచి అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

అగ్నిప్రమాదం గురించి తెలియగానే అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్య, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, అనంతపురం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కొవిడ్‌ వార్డులోని బాధితులను మరో వార్డుకు తరలించామని అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, మంటలు వ్యాపించకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి.

అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ లోజరిగిన అగ్ని ప్రమాదం పై తక్షణమే స్పందించిన ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.... అనంతపురం ప్రభుత్వ సర్వ జన హాస్పిటల్ లోని రికార్డు రూమ్ లో ఎలెక్రిటిక్ షార్ట్ సర్క్యూట్ తో జరిగిన స్వల్ప అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు... సమాచారం తెలిసిన వెంటనే అనంతపురం జిల్లా కలెక్టర్... జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడివివరాలు అడిగి తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని... హాస్పిటల్ లో రికార్డు రూమ్ పక్కన ఉన్న వార్డ్లో24మంది కరోనా పేషంట్స్ ను తక్షణమే అర్ధో వార్డ్ కు తరలించాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ ను అదేశించారు.

ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కు మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు... ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నాయా..లేదా.. క్షుణ్ణంగా తనిఖీలు చేయాలన్నారు. హాస్పిటల్ లో రోగులు నుండి అధిక ఫీజులు వసూలు చేస్తే ప్రభుత్వ పరంగా కఠినంగా చర్యలు ఉంటాయన్నారు. హాస్పిటల్స్ ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ముందోస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.... అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ లో జరిగిన స్వల్ప అగ్ని ప్రమాదంలో అగ్ని మాపక సిబ్బంది సకాలంలో స్పందించి నివారణ చర్యలు చేపట్టారని, ... కేవలం రికార్డు రూమ్ లో కొన్ని పుస్తకాలు, పాత ఎక్సరే లు మాత్రమే అగ్నికి దహనమయ్యాయని తెలియజేశారు. అన్ని హాస్పిటల్స్ భద్రత ప్రమాణాలు పరిశీలించి చర్యలు చేపట్టాలని మంత్రి నాని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories