Andhra Pradesh: జీవో నెంబర్ 64పై మండిపడుతున్న వైద్యారోగ్యశాఖ

Health Department Fired on GO Number 64
x

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: ఉద్యోగులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్న జీవో * వైద్యరంగంపై అవగాహన లేని వారిని ఎలా నియమిస్తారని ఫైర్

Andhra Pradesh: మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు అయింది ఏపీలో వైద్యారోగ్య సిబ్బంది పరిస్థితి. కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తూ సతమతం అవుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 64శాపంగా మారింది. ఆ శాఖ ఉద్యోగులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. తమపై పర్యవేక్షించేలా జాయింట్ కలెక్టర్లను నియమించడం వైద్యసిబ్బంది మండిపడుతున్నారు. వైద్యరంగంపై అవగాహన లేని వారిని ఎలా నియమిస్తారని ఫైర్ అవుతున్నారు.

ఏపీ ప్రభుత్వం జూన్ 21న వైద్యారోగ్యశాఖలో జీవో నెంబర్ 64ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం వైద్యారోగ్యశాఖలో వైద్యులతో పాటు అన్ని విభాగాలపై పూర్తివేక్షణను జిల్లాలో జాయింట్ కలెక్టర్‌లకు బదలాయించింది. వైద్యారోగ్యశాఖలో పరిపాలన వ్యవహారాలను పూర్తిస్థాయిలో జాయింట్ కలెక్టర్లు‌కు బదలాయిస్తూ వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి జీవో నెంబర్ 64ను జారీ చేశారు. ఈజీవో పై వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పూర్తిగా వ్యతిరేకిస్తోంది.

జీవో 64ను వెంటనే రద్దు చేయాలని వైద్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈమేరకు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ పోరాటంలో ఎన్జీవోలు, ఐఎంఏ వైద్యుల పారామెడికల్ అసోసియేషన్‌తో పాటు వైద్య విభాగంలో ఉన్న మిగిలిన అసోసియేషన్ల సహాయ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు..

వైద్యావ్యవస్థపై ఎటువంటి అవగాహన లేని వారికి మెడికల్ అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు ఏ విధంగా అప్పగిస్తారని ప్రశ్నిస్తు్న్నారు. వైద్యా విద్య, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంబంధిత విభాగములలో పూర్తిగా వైద్యలకు, వైద్య సంబంధిత అధికారులకు మాత్రమే పరిపాలన బాధ్యతలను అప్పగించి స్వేచ్ఛగా బాధ్యతలు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వైద్య సంఘాలు కోరుతున్నాయి.

మొత్తానికి వైద్యారోగ్యశాఖ ఉద్యోగులకు ఏమాత్రం ఇష్టం లేని జీవో నెంబర్ 64ను తక్షణమే వెనక్కి తీసుకోవాలి అని వైద్యాసంఘాలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్ర కమిటీ ఇచ్చే ఆదేశాల మేరకు భవిష్యత్‌ కార్యాచరణ ప్రారంభిస్తామంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories