ఏపీలో మరో ఎన్నికల సందడి.. త్వరలో..

ఏపీలో మరో ఎన్నికల సందడి.. త్వరలో..
x
Highlights

రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతీరాజ్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2020, జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే...

రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతీరాజ్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2020, జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు మంత్రులకు సంకేతాలు ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారంహైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయనుంది. హైకోర్టు నుంచి అనుమతి రాగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ రిజర్వేషన్ అంశాలపై చర్చించనుంది.

అయితే గత ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో 59.85 శాతం కోటాను అమలు చేయగా.. అందు కోసం కోర్టును ఒప్పించాలని అందుకు తగ్గట్లుగా వాదించాలని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసిలకు 62.03శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి. అయితే 2014లో రాష్ట్ర విభజన కావడంతో రిజర్వేషన్ల శాతం 59.85 శాతంకు పరిమితం కావాల్సి వచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories