కనెక్ట్ టు ఆంధ్రా సొసైటీ ఏర్పాటు

కనెక్ట్ టు ఆంధ్రా సొసైటీ ఏర్పాటు
x
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక తీసుకున్నారు. కనెక్ట్ టు ఆంధ్ర సొసైటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అమరావతి-కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం కనెక్టు టు ఆంధ్రా సొసైటీని ఏర్పాటు చేసింది. లాభాపేక్ష రహిత సంస్థగా కనెక్ట్ టు ఆంధ్రా సొసైటీ పనిచేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఎస్ఆర్ ఫండ్ నిర్వహణ కోసం రెండు వేర్వేరు ఉన్నత స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఇందులో భాగంగా సీఎం జగన్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా ఆర్థికమంత్రి, సీఎస్ సహా మూడు ప్రముఖ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఉండనున్నారు. అయితే జిల్లా స్థాయి కమిటీలకు కలెక్టర్లు నాయకత్వం వహిస్తారని ప్రభుత్వం పేర్కొంది. ఈ కమిటీ ప్రధానంగా నిధులు సమీక్షరించి నవరత్న పథకాలకు కేటాయించడానికి కార్యాచరణను సిద్ధం చేసింది. నవరత్నాలతోపాటు విద్య, వైద్య రంగాలలో సిఎస్‌ఆర్ నిధుల వినియోగంపై కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అభివృద్ధి చేయవలసిన అంశాల జాబితాను కనెక్ట్ టు ఆంధ్ర సొసైటీ సిద్ధం చేస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories