YS Jagan: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక మరింత కఠినం

YS Jagan: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక మరింత కఠినం
x
YSJagan
Highlights

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ లో లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చెయ్యబోతోంది.

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ్టి నుంచి లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చెయ్యబోతోంది.ఇలాగే ఉంటే ఊళ్లకు ఊళ్లు కరోనా బారిన పడతాయని ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే రైతు బజార్ల దగ్గర జనం గుమికూడకుండా వాటిని విభజించింది. కొత్తగా వేర్వేరు చోట్ల వాటిని ఏర్పాటు చేసింది. రైతు బజార్లను మధ్యాహ్నం 1 గంట వరకూ నిర్వహించి జనం ఒకేసారి గుంపులుగా ఉండకుండా చేయడానికి ప్రయత్నించింది. కానీ, శనివారం ఒక్క రోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోనుంది.

కరోనా వైరస్ వలన అన్ని రంగాలు కుదేల్వవడంతో పనులు లేక... చేతిలో డబ్బుల్లేవు. అందువల్ల ప్రభుత్వం వారిని ఆదుకోబోతోంది. బియ్యం, కేజీ పంచదార ఇతర సరుకుల్ని ఇవ్వబోతోంది. ఇక దుకాణాల వద్ద ప్రజలు గుమికూడ కుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.పాజిటివ్ కేసులు పెరగడంతో... ప్రజలు లాక్ డౌన్‌ను తప్పనిసరిగా పూర్తిగా పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ ఇవాళ్టి నుంచీ తన చర్యలు, నిర్ణయాలు తీసుకుంటూ సమావేశాలు ఏర్పాటు చేసుకోబోతోంది. కృష్ణా జిల్లాలో నాలుగు కేసులు నమోదవగా, గుంటూరు జిల్లాలో కూడా 4, విశాఖపట్నం లో కూడా 4, ప్రకాశం జిల్లాలో మూడు కేసు నమోదు కాగా, కర్నూల్ లో 1 నెల్లూరు , తూర్పుగోదావరి, తిరుపతిలో ఒక కేసు నమోదైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories