టీటీడీలో సంచలన నిర్ణయం.. వారిని తొలగించే అవకాశం..

టీటీడీలో సంచలన నిర్ణయం.. వారిని తొలగించే అవకాశం..
x
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. టీటీడీలో రిటైర్డ్ అయినా దేవస్థానం అవసరార్ధం పనిచేస్తున్న...

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. టీటీడీలో రిటైర్డ్ అయినా దేవస్థానం అవసరార్ధం పనిచేస్తున్న రిటైర్డ్ ఆఫీసర్లు, సిబ్బందిని తొలగిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిలలో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారులను తొలగించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. టీటీడీ తదనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలగించేందుకు 100 మంది వ్యక్తుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. శ్రీవారి ఆలయం OSD అయిన డాలర్ శేషాద్రి కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీలో ఎక్కువ కాలం పనిచేసిన డాలర్ శేషాద్రికి శ్రీవారి ఆలయ సంప్రదాయాలు, వ్యవహారాలపై మంచి పట్టు ఉంది.

శ్రీవారిని సందర్శించే ప్రముఖులకు అవసరమైన ఏర్పాట్లను ఆయన చూస్తుంటారని చెబుతరు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే, డాలర్ శేషాద్రిని టీటీడీ నుంచి తొలగించే అవకాశం ఉంది. అలాగే ఈ తొలగింపు జాబితాలో నిత్య అన్నదాన ప్రసాదం ట్రస్ట్ సూపరింటెండెంట్ వేణుగోపాల్, దేవస్థానం డిప్యూటీ జడ్జి వెంకట సుబ్బనాయుడు, ఎస్వీ రికార్డింగ్ సూపరింటెండెంట్ మునిరత్నం రెడ్డి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కోఆర్డినేటర్ చెన్నూరామయ్య ఉన్నారు. అయితే ఇందులో మునిరత్నం రెడ్డి బుధవారమే రాజీనామా చేశారు. ఇన్ఫర్మేషన్ సెంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్టింగ్ మరియు అవుట్సోర్సింగ్ సిబ్బంది, టీటీడీకి చెందిన కళ్యాణ్ మండపాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories