మత్య్యకారుల వలసల నివారణే ప్రభుత్వ ధ్యేయం.. ఏపీ సీఎం ప్రత్యేక చర్యలు

మత్య్యకారుల వలసల నివారణే ప్రభుత్వ ధ్యేయం.. ఏపీ సీఎం ప్రత్యేక చర్యలు
x
Highlights

అన్ని వర్గాలకు సమ న్యాయం పాటిస్తూ వారి జీవనోపాధికి ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం మత్స్యకారులను అదుకునేందుకు ప్రత్యేక కార్యచరణ చేస్తోంది.

అన్ని వర్గాలకు సమ న్యాయం పాటిస్తూ వారి జీవనోపాధికి ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం మత్స్యకారులను అదుకునేందుకు ప్రత్యేక కార్యచరణ చేస్తోంది.ఇటీవల కాలంలో సముద్రంలో చేపలు నానాటికీ తగ్గుముఖం పట్టడం వల్ల వీరంతా వలసల బాట పడుతున్నారు. కొంతమంది ఇతర పనులు చేసేందుకు వలస వెళుతుండగా, మరికొంత వేరే ప్రాంతాల్లో చేపల వేట చేసేందుకు వెళుతున్నారు. ఉదాహరణకు విశాఖ జిల్లా నుంచి ఒడిశాలోని పారాదీప్ తీరానికి వందల కుటుంబాలు తరలి వెళుతుంటాయి. వీరు స్థానికంగా జరిగే పండగలు, పబ్బాలకు వస్తుంటారు. దీంతో పాటు ఎన్నికల వేళ వస్తుంటారు. ఇలా వలసలు వెళ్లకుండా ఎక్కడికక్కడే స్థానికంగా ఉంటూ జీవనోపాధి పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. వివిద ప్రాంతాల్లో మేజర్ షిప్పింగ్ హార్బర్లు., ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాష్ట్రంలోని మత్స్యపరిశ్రమను మరింతగా అభివృద్ధి చేసేందుకు పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మత్స్యకారుల వలసలను తగ్గించడమే కాకుండా వారి జీవనోపాధిని పెంచేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మేజర్ ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్ ల్యాండింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

తూర్పుగోదావరిలోని ఉప్పాడ, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, శ్రీకాకుళంలోని బడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లా పూడిమడక, కృష్ణాజిల్లా మచిలీపట్నం, గుంటూరులోని నిజాంపట్నం, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్న ప్రాంతాల్లో మేజర్ ఫిషింగ్ హర్బర్లను, శ్రీకాకుళం జిల్లాలోని మంచినీళ్లపేటలో ఫిష్ ల్యాండింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాగా, గతంలో ఏపీలో ఎనిమిది చోట్ల ఫిషింగ్ హార్బర్లకు ఉన్న విషయాన్ని సీఎం వైఎస్ జగన్ స్వయంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories