Health Staff Recruitment in AP: మరింత పగడ్భందీగా కరోనా సేవలు.. 11,200 మంది సిబ్బంది నియామకం

Health Staff Recruitment in AP: మరింత పగడ్భందీగా కరోనా సేవలు.. 11,200 మంది సిబ్బంది నియామకం
x
Health Staff Recruitment
Highlights

Health Staff Recruitment in AP: ఏపీలో కోవిద్ రోగులకు అవసరమైన సేవలను ఇక నుంచి పగడ్భందీగా అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది.

Health Staff Recruitment in AP: ఏపీలో కోవిద్ రోగులకు అవసరమైన సేవలను ఇక నుంచి పగడ్భందీగా అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దీనికి అనుగుణంగా దేశంలోని అన్నిరాష్ట్రాల కంటే భిన్నంగా టెస్టులు అధిక స్థాయిలో నిర్వహిస్తోంది. దీంతో పాటు రోగులకు అవసరమైన బెడ్లు వీలైనన్ని పెంచేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఈ రోగులకు మరింత పగడ్భందీగా వైద్య సేవలందించేందుకు అదనపు సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంది. ఈ విషయాన్ని ప్రకటించిన ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి అందరికీ పారదర్శకంగా సేవలందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్లర్లను ఆదేశించారు.

రాష్ట్రంలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో వైద్యం, ఇతర సంబంధిత సేవల కోసం 11,200 మంది సిబ్బందిని నియమిస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు తెలిపారు. కరోనా నివారణపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం సమక్షంలో జరిగిన సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలిలా ఉన్నాయి.

► కోవిడ్‌ నివారణ చర్యలను అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. పెద్ద సంఖ్యలో పరీక్షలు చేస్తున్నాం. పాజిటివ్‌గా వచ్చిన కేసులను ప్రకటిస్తున్నాం.

► పారదర్శకత అనేది కోవిడ్‌ నివారణ చర్యల్లో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నాం.

► రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ ఆసుపత్రుల్లో 37,189 బెడ్లు అందుబాటులో ఉన్నాయి.

► ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 16,404. ఆక్సిజన్, వెంటిలేటర్‌ తరహా చికిత్స పొందుతున్న వారు 4,965 మంది.

► మరణాల రేటు దేశంలో 2.07 శాతం ఉంటే అదే ఏపీలో 0.89 శాతమే. అదే కర్ణాటకలో 1.85 శాతం, తమిళనాడులో 1.63, మహారాష్ట్రలో 3.52 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 8.87 శాతంగా

ఉంటే రాష్ట్రంలో 8.56, కర్ణాటకలో 9.88, తమిళనాడులో 9.26, మహారాష్ట్రలో 19.36, ఢిల్లీలో 12.75 శాతంగా ఉంది.

► ప్రతి 10లక్షల జనాభాకు 43,059 మందికి పరీక్షలు చేస్తున్నాం. శ్రీకాకుళం, కర్నూలు, కడప, కృష్ణా, నెల్లూరు, పశ్చిమ గోదావరి, చిత్తూరులో రాష్ట్ర సగటు కన్నా ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నాం.

Show Full Article
Print Article
Next Story
More Stories