మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్...

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్...
x
Representational Image
Highlights

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో మద్యం దుకాణాలు అన్ని మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో కొన్ని మినహాయింపులు ఇస్తూ మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు ముందుగానే మూతపడ్డాయి. మూడు నెలలుగా తాగేందుకు మద్యం లేక మందుబాబులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం మందుబాబులకు శనివారం కిక్ ఎక్కించే వార్త చెప్పింది.

ఏపీలో మద్యం ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రభుత్వ అనుమతితో ఆదివారం రాష్ట్రంలో 20 డిస్టెల్లరీలు తెరుచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ అనుగుణంగా మద్యం ఉత్పత్తికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా... మద్యం తయారీ కంపెనీలను పూర్తిగా శానిజైట్ చేయాలని మార్గదర్శకాలు విడుదల చేశారు.మద్యం తయారీ సమయాల్లో కార్మికులు భౌతక దూరం పాటించాలని, మద్యం తయారీ కంపెనీల్లో ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లు రెండు వేర్వేరుగా ఉండాలని, లిఫ్టు లు వాడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మద్యం తయారీ కంపెనీల్లో గుట్కా, సిగరేట్‌ మాదకద్రవ్యాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories