చంద్రబాబు విశాఖ పర్యటనకు ప్రభుత్వ అనుమతి

చంద్రబాబు విశాఖ పర్యటనకు ప్రభుత్వ అనుమతి
x
Highlights

సోమవారం విశాఖపట్నంలో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. చంద్రబాబు విశాఖ పర్యటనకు ఏపీ డీజీపీ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు విజ్ఞప్తిపై...

సోమవారం విశాఖపట్నంలో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. చంద్రబాబు విశాఖ పర్యటనకు ఏపీ డీజీపీ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన డీజీపీ ఎట్టకేలకు అనుమతి ఇచ్చారు. దీంతో ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు చేరుకుంటారు చంద్రబాబు. అనంతరంవెంకటాపురం గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు.

ఆ తరువాత స్థానిక టీడీపీ నాయకులతో కలిసి.. ఎల్జీ పాలిమెర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన ప్రాంతాల్లో పర్యటిస్తారు. సాయంత్రం రోడ్డుమార్గంలో అమరావతిలోని ఆయన నివాసానికి వెళతారు. కాగా రెండు నెలల తరువాత తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు చంద్రబాబు. కరోనా నేపథ్యంలో ఆయన ఇన్నిరోజులు ఇంటికే పరిమితం అయ్యారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన సమయంలో విశాఖ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరారు చంద్రబాబు.

కాగా, చంద్రబాబు లాక్ డౌన్ ప్రకటించడానికి కొద్దిగా ముందు హైదరాబాద్ వెళ్ళారు. అయితే, ఆయన వెళ్ళిన వెంటనే లాక్ డౌన్ విధించడంతో తిరిగి అమరావతి వెళ్ళడానికి వీలు పడలేదు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో పాటు, లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో చంద్రబాబు నాయుడు అమరావతి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈమేరకు అయన శనివారం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ డీజీపీ లకు అనుమతి కోసం లేఖ రాశారు. దానికి తెలంగాణా ప్రభుత్వం నుంచి వెంటనే అనుమతి లభించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆదివారం సాయంత్రం అనుమతి లభించింది.

కాగా, మాజీ ముఖ్ఈయమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 20 వతేదీన హైదరాబాద్ వెళ్ళారు. తరువాత వరుస లాక్ డౌన్ ల నేపధ్యంలో అక్కడే ఉండిపోయారు. ఈ మధ్య విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీ ఘటన జరిగినప్పుడు అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శించేందుకు అయన ప్రయత్నించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, అప్పుడు ఆయనకు అనుమతి లభించలేదు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories