వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లడానికి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాల జారీ

వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లడానికి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాల జారీ
x
Highlights

కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో కార్మికులు, తమ తమ రాష్ట్రాలకు పయనమయ్యారు.

కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో కార్మికులు, తమ తమ రాష్ట్రాలకు పయనమయ్యారు. ఏపీకి చెందిన వలస కార్మికులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. వీరంతా స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వ మార్గదర్శకాలు :

* వలస కార్మికులు 1902కి ఫోన్ చేసి తమ వివరాలు చెప్పాలి.

* ఇతర రాష్ట్రాల్లో రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ నుంచి వచ్చే వారిని ప్రత్యేకంగా గుర్తిస్తారు.

* గ్రీన్ జోన్‌లో ఉన్నవారు మాత్రమే గ్రీన్ జోన్‌కి వెళ్లేందుకు అనుమతి ఉంది.

*ప్రతి జిల్లాలో ఒక బస్టాండ్, ఒక రైల్వే‌స్టేషన్‌ని గుర్తిస్తారు.

* ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఆ జిల్లాలో గుర్తించిన రైల్వేస్టేషన్ లేదా బస్టాండ్ చేరుకుంటారు.

* అలా వచ్చిన వారికి స్క్రీనింగ్ ఉంటుంది. పూల్ పద్ధతిలో కరోనా పరీక్షలు ఉంటాయి.

* 14 రోజుల క్వారంటెన్‌ కేంద్రానికి పంపి ఆ తర్వాత పరీక్షలు జరిపి, నెగెటివ్ వస్తే. ఇళ్లకు వెళ్లనిస్తారు.

*రిలీఫ్ క్యాంప్‌లో నుంచి స్వగ్రామాలకు వెళ్లాలి అనుకునే వాళ్ళకు రాండమ్‌గా పరీక్షలు ఉంటాయి

* పరీక్షల్లో పాజిటివ్ వస్తే... ఆ వ్యక్తితో ఉన్న గ్రూపు మొత్తాన్నీ అక్కడే ఉంచుతారు. సొంత జిల్లాకు పంపరు.

* పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రి తీసుకెళ్తారు.

* ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి ఆ రాష్ట్రాల అధికారులతో ఏపీ అధికారులు సమన్వయం చేసుకుంటారు.

*కొవిడ్ పరీక్షల్లో నెగటివ్ వస్తే వారిని బస్సులో 50 శాతంకు మించకుండా తరలిస్తారు. 36 మంది ప్రయాణించే బస్సులో 18 మందే పంపిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories