Top
logo

New pensions in Andhra Pradesh: నేటి నుంచి కొత్త ఫెన్షన్లు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు

New pensions in Andhra Pradesh: నేటి నుంచి కొత్త ఫెన్షన్లు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు
X
Pensions Distribution in Andhra Pradesh
Highlights

New pensions in Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరింత మందికి వైఎస్సార్ పెన్షన్ కానుకను అందించేందుకు సిద్ధమయ్యింది.

New pensions in Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరింత మందికి వైఎస్సార్ పెన్షన్ కానుకను అందించేందుకు సిద్ధమయ్యింది. ప్రతి నెలా మాదిరిగానే పాత వాటితో పాటు కొత్తగా ఎంపిక చేసిన సుమారుగా 10వేల పింఛన్ల వరకు పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నగదును ఇప్పటికే సంబంధిత అధికారులకు బదిలీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైయస్ఆర్ పెన్షన్ కానుకను అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా ఇవాళ (బుధవారం) 59.03 లక్షల మందికి పెన్షన్ అందించేందుకు సర్వం సిద్దమైంది. ప్రతినెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల చేతికి పెన్షన్ అందించాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

జూలై నెల పెన్షన్ చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.1442.21 కోట్లను విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు ఈ సొమ్మును జమ చేసింది. బుధవారం ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 2.68 లక్షల మంది వాలంటీర్లు నేరుగా పెన్షనర్ల ఇళ్ళ వద్దకే వెళ్ళి పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల చేతికే అందించనున్నారు.

కొవిడ్-19 నేపథ్యంలో బయోమెట్రిక్‌కు బదులుగా జియో ట్యాగింగ్‌తో కూడిన ఫోటోలను తీసి అప్‌లోడ్ చేస్తారు. అలాగే లాక్‌డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో ఉండిపోయిన 3,364 మంది పెన్షనర్ల సొమ్మును వారు తిరిగి వచ్చిన తరువాత చెల్లించనున్నారు.

అలాగే జిల్లాల పరిధిలో పెన్షన్ బదిలీ కోసం 18,533 మంది, ఇతర జిల్లాలకు తమ పెన్షన్ బదలీ చేయాలని 7,501 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి అప్లికేషన్లను అధికారులు పరిశీలించి, వారికి కూడా ఆ మేరకు పెన్షన్ బదిలీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లలో 5,165 మంది హెల్త్ పెన్షనర్లు ఉన్నారు. పోర్టబులిటీ ద్వారా పెన్షన్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న 4,010 మంది పెన్షనర్లకు కూడా వారు కోరుకున్నప్రాంతంలోనే పింఛన్ ను అందించనున్నారు.


Web TitleAndhra Pradesh Government Makes all Arrangements for New Pensions to Distribute From Today
Next Story