ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. బిట్ పేపర్..

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. బిట్ పేపర్..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. ఈ ఏడాది నిర్వహించే పదవ తరగతి పరీక్షల్లో బిట్ పేపర్ ను తొలగించాలని నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. ఈ ఏడాది నిర్వహించే పదవ తరగతి పరీక్షల్లో బిట్ పేపర్ ను తొలగించాలని నిర్ణయించింది. ఈ విషయాన్నీ గతేడాదే ఏపీ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.. అందుకు తగ్గట్టే 2019-2020 విద్యా సంవత్సరం మొదట్లోనే ఇంటర్నల్ మార్కులు, బిట్‌పేపర్‌ను తొలగించింది. బిట్‌పేపర్ కు బదులుగా ప్రతీ సబ్జెక్టులోనూ 100 మార్కులకు ప్రశ్నలు ఉండేలా పేపర్ ను కూడా తయారు చేస్తోంది.

ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే తాజాగా కరోనా కారణంగా దాదాపు నాలుగు నెలలు ఆలస్యంగా జరుగుతున్న ఈ పారీక్షల్లో 11 ప్రశ్నా పత్రాలను ఆరు పేపర్లకే కుదించింది. ఇక ఈ కొత్త విధానంలో ప్రశ్నల సంఖ్యను కాకుండా మార్కులను మాత్రమే పెంచారు. 50 మార్కులు వంద అయ్యాయి. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు.. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగానే ఇలా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్ణయించింది. కాగా దీనిపై పలువురు భిన్నాబిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం దీనిని స్వాగతిస్తున్నారు. ఇక పరీక్ష వ్యవధి గతంలో 2.45 గంటలుగా ఉండేది దాన్ని మరో అరగంట పెంచినట్టు వార్తలు వస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories