విశాఖపట్నంలో గణతంత్ర దినోత్సవ వేడుక అందుకేనా.!

విశాఖపట్నంలో గణతంత్ర దినోత్సవ వేడుక అందుకేనా.!
x
Highlights

విశాఖపట్నంలో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈసారి జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను...

విశాఖపట్నంలో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈసారి జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు ప్రారంభించారు. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న మొదటి గణతంత్ర వేడుక కావడంతో, దీన్ని వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదన చేస్తున్న తరుణంలో ఈ వేడుకకు ప్రాధాన్యత ఏర్పడింది.

విశాఖపట్నం రాష్ట్ర రాజధానిగా మార్చడానికి జగన్ అనుకూలంగా ఉన్నారని సూచించడానికె ఇక్కడ రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జిఎన్ రావు మరియు బోస్టన్ కమిటీ నివేదికల ప్రతిపాదనలను అధ్యయనం చేయడానికి నియమించిన హై పవర్ కమిటీ కూడా వచ్చే నాలుగైదు రోజుల్లో దాని నివేదికను సమర్పించనుండగా, ఈ నెల 20 న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించింది. అయితే, విశాఖపట్నంలో వేడుకలు నిర్వహించాలన్న తాజా నిర్ణయంతో, ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories