ఏపీలో నేటి నుంచి మద్యం అమ్మకాలు.. భారీగా పెరిగిన మద్యం ధరలు ఇవే

ఏపీలో నేటి నుంచి మద్యం అమ్మకాలు.. భారీగా పెరిగిన మద్యం ధరలు ఇవే
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి వైన్స్ షాపులు తెరుచుకున్నాయి. ఈ సారి పెరిగిన మద్యం రేట్లు మందుబాబులకు షాక్ ఇస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి వైన్స్ షాపులు తెరుచుకున్నాయి. ఈ సారి పెరిగిన మద్యం రేట్లు మందుబాబులకు షాక్ ఇస్తున్నాయి. మద్యం అమ్మకాలు తగ్గించే క్రమంలో భాగంగా ధరలను 25 శాతం పెంచుతున్నట్లుగా ఇప్పటికే వెల్లడించారు.

మద్యం కొనుగోలును తగ్గించడం కోసమే ధరలను పెంచామని అంటున్న ఏపీ సర్కారు చెబుతోంది. తాజాగా పెరిగిన ధరలు చూస్తే ఫారిన్ లిక్కర్ బాటిల్ పై రూ. 150, లైట్ బీర్ ధరను రూ. 20, స్ట్రాంగ్ బీర్ ధరను రూ. 10 మేరకు పెంచింది. ఫుల్ బాటిల్ పై రూ. 80, క్వార్టర్ బాటిల్ పై రూ. 20, హాఫ్ బాటిల్ పై రూ. 40 చొప్పున ధరలను పెంచారు. స్టాక్ ఉన్న మద్యాన్ని పాత ధరలకే విక్రయించాలని తెలిపింది. కొత్త mrp ధరలు ముద్రించినవి మార్కెట్లోకి వచ్చిన తరువాతే కొత్త ధరలు అమలులోకి వస్తాయని అధికారులు చెప్పారు.

సోమవారం నుంచి మద్యం షాపులు తెరుచుకుంటాయని ఎక్ససైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయింత్రం 7 గంటల వరకు మద్యం షాపులు ఓపెన్ ఉంటాయని చెప్పారు. ఒక్కసారి అయిదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని, షాపుల వద్ద సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని కోరారు.మాస్క్ లేనిదే మద్యం దుకాణాలకు అనుమతి లేదని వెల్లడించారు. ఇప్పటికే మద్యం అమ్మకాలపై మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్ కి పంపినట్టు రజిత్ భార్గవ్ తెలిపారు. పెరిగిన ధరలతో రాష్ట్రానికి ఏటా రూ. 4 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తుంది ప్రభుత్వం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories