జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో సరి, బేసి విధానం అమలు

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో సరి, బేసి విధానం అమలు
x
YSJagan(File Photo)
Highlights

కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది.

కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. మే మూడు వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఉధృతి కొనసాగుతుంది. గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 94కి చేరింది.

ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరులో కరోనా కేసులు నియంత్రణలో వినూత్న నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాలు కొనుక్కోవడానికి సరి, బేసి విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఇవాళ్టి నుంచే ఆ విధానం అమల్లోకి రానుంది. మార్కెట్లు, షాపులు ఇక నుంచి సరి సంఖ్య తేదీల్లోనే పనిచేయనున్నాయి.

జిల్లాలో షాపులు, మార్కెట్లు బేసి సంఖ్య తేదీల్లో అవన్నీ బంద్ అవుతాయని అర్బన్ డీఐజీ రామకృష్ణ తెలిపారు. సరి తేదీల్లో మార్కెట్, షాపులు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు తీసి ఉంటాయని వెల్లడించారు. ఇవాళ 14 తేదీ ఉదయం నిత్యావసర సరుకులన్నీ అందుబాటులో వుంటాయి, రేపు 15వ తేదీ అన్నీ మూసి ఉంటాయని తెలిపారు. మిగిలిన సమయాల్లో మందుల షాపులు, అత్యవసర ఆస్పత్రులు మినహా మిగిలినవన్నీ మూసివేసి ఉంటాయని తేల్చి చెప్పారు.

మాస్కులు లేకుండా ఎవరు బయట తిరగవద్దని, గవర్నమెంట్ ఉద్యోగులు, ఆఫీసులకు వెళ్లేవారు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల లోపు వెళ్లి, సాయంత్రం 5 నుంచి 6 గంటల లోగా ఇళ్లకు చేరుకోవాలని ఇతరులు ఎవరు తిరగరాదని, నిబంధనలు ఉల్లంఘించే వారి వాహనాలు స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories