Anganwadi: అంగన్ వాడీ వర్కర్లకు ప్రభుత్వం అల్టిమేటం.. విధుల్లో చేరాలని హెచ్చరిక

Andhra Pradesh Government Has Issued An Ultimatum To Anganwadi Workers It Issued Orders Giving A Last Chance
x

Anganwadi: అంగన్ వాడీ వర్కర్లకు ప్రభుత్వం అల్టిమేటం.. విధుల్లో చేరాలని హెచ్చరిక

Highlights

Anganwadi: ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మె

Anganwadi: ఏపీ అంగన్వాడీ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు 22 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. వేతనాల పెంపుతో పాటు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ..వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు నిరసన ఆపేది లేదని ఇప్పటికే ప్రభుత్వానికి అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వారికి నోటీసులు జారీ చేసింది. జనవరి 5లోగా విధులకు హాజరుకావాలని..లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అందులో భాగంగానే.. జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వ విజ్ఞప్తి పేరుతో అంగన్వాడీలకు నోటీసులు ఇచ్చింది. అంగన్వాడీల సమ్మె కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు, వారికి ఇప్పటికే పూర్తి చేసిన హామీలను వివరిస్తూ ప్రభుత్వం నోట్ జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories