ఐదు రోజుల్లో రేషన్ కార్డు.. దరఖాస్తు చేయండి ఇలా...

ఐదు రోజుల్లో రేషన్ కార్డు.. దరఖాస్తు చేయండి ఇలా...
x
Representational Images
Highlights

కరోనా వైరస్ విజృంభణ, మరోవైపు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

కరోనా వైరస్ విజృంభణ, మరోవైపు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాని మోదీ లాక్‌డౌన్ మరో 19 రోజులు మే 3 వరకు పొడిగించడంతో అప్రమత్తం అయ్యారు. మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే కూడదని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. రేషన్ కార్డు లేకున్నా అర్హులైతే బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు.

రేషన్ కార్డు 5 రోజుల్లోనే ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు సూచనలు చేశామన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునే అర్హులైన వారు దగ్గరలోని మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు అందుబాటులో లేకపోతే మీసేవ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులో పూర్తి వివరాలను నింపిన అవసరమైన పత్రలను జతపరచాలి. ఆధార్ కార్డు, ఇంటి చిరునామా ఉండే ఇతర డాక్యుమెంట్లు వంటివి. ఆ దరఖాస్తును తీసుకెళ్లి మీసేవ కేంద్రంలో అందజేసి,తగిన రుసుం చెల్లించాలి.

మీసేవలో దరఖాస్తును అందజేసిన తర్వాత ఓ నంబర్ కేటాయిస్తూ.. స్లిప్ ఇస్తారు. ఆ అర్హులైతే దరఖాస్తును పరిశీలించి రేషన్ కార్డుకి అర్హులని మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. తర్వాత ఆ మెసేజ్‌లో నంబర్‌, గతంలో ఇచ్చిన స్లిప్ తీసుకెళితే మీసేవలో రేషన్ కార్డు ఇస్తారు. అంతేకాదు స్పందన యాప్, 1800 452 4440, 1100 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.


Show Full Article
Print Article
Next Story
More Stories