Lockdown: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సడలింపులకు అదనపు మార్గదర్శకాలు

Lockdown: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సడలింపులకు అదనపు మార్గదర్శకాలు
x
YS Jagan (File Photo)
Highlights

లాక్ డౌన్ సడలింపుపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

లాక్ డౌన్ సడలింపుపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపుల తీసుకున్న మార్గదర్శకాలు అనుగుణంగా మరికొన్ని అదనపు సడలింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకు పలు రంగాలకు మినహాయింపులు ఇస్తుంది.

వ్యవసాయ రంగం, హార్టికల్చర్ పనులకు మినాహాయింపు ఇచ్చింది. ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ కు, ఆర్థిక రంగానికి మినహాయింపు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనుల తో పాటు పవర్ లైన్స్, టెలికం కేబుల్స్ పనులకు, కావల్సిన అనుమతులతో ఈ కామర్స్ కంపెనీలకు, వారు వాడే వాహనాలకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రం పరిధిలో వలస కార్మికులకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పని చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే మీనాహాయింపు ఇవ్వనుంది. వలస కార్మికులు లాక్ డౌన్ సమయంలో ఏ రాష్ట్రంలో ఉంటే అదే రాష్ట్రం లో మాత్రమే అనుమతి ఇస్తుంది. ఎలక్ట్రిక్ ఫ్యాన్స్, ఓడల కు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉంటే షాపులు, మార్కెట్ కాంప్లెక్స్ లకు అనుమతి ఇస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories