ఏప్రిల్‌ నెల జీతాలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

ఏప్రిల్‌ నెల జీతాలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ
x
Highlights

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయింది.దాంతో వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. కరోనా సంక్షోభం కారణంగా అన్ని ప్రభుత్వాల మాదిరిగానే ఏపీ ప్రభుత్వం కూడా ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతోంది. దాంతో గతనెలలో పోలీసులు, వైద్య, ఆరోగ్యశాఖ, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించింది.. మిగిలిన ఉద్యోగులందరికీ కోత విధించి సగం జీతం మాత్రమే ఇచ్చింది.

ఈ క్రమంలో ఏప్రిల్ నెల వేతనాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇదివరకటి గానే పోలీసులు, వైద్య, ఆరోగ్యశాఖ, పారిశుద్ధ్య కార్మికులకు 100 శాతం జీతాలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. మిగిలిన ఉద్యోగులకు సగం వేతనమే చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ప్రభుత్వ పెన్షనర్లకు కూడా పూర్తి పెన్షన్ ను‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి గత నెల వీరికి 50శాతం పెన్షన్‌ మాత్రమే చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories