
కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. దీంతో మందుబాబులకు కష్టాలు తప్పడం లేదు.
కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. దీంతో మందుబాబులకు కష్టాలు తప్పడం లేదు. మద్యం దుకాణాలు బంద్ కావడంతో ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో అయితే కల్లు తాగి మందుబాబులు కాస్త ఊరట చెందుతుంటే, నగరాలు, పట్టణాల్లో మాత్రం కష్టాలు తప్పడం లేదు.మద్యం లేక ఇబ్బందిపడుతున్న మందుబాబులకు ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.
రోజూ మద్యం సేవించే వారు, మద్యానికి బానిసలైన వారికీ ఈ లాక్ డౌన్ చర్యతో ప్రభుత్వ ఆదేశాల మేరకు వైన్ షాపులు , బార్లు మూసివేయడంతో ఎటూ పాలుపోలేని పరిస్థితి ఏర్పడిందంటోంది ప్రభుత్వం. మద్యం దొరకక పోవడంతో మానసిక సమస్యలతో పాటు శారీరకంగా సమస్యలతో గుండె దడ, శ్వాస సమస్యలు, కాళ్ళు చేతులు వణకడం, రాత్రుళ్లు నిద్రపట్టక పోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొంది.
అయితే జగన్ ప్రభుత్వం మందుబాబులకు లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మధ్యనికిందురంగా ఉండాలంటోంది. దీనికి సంబంధించి కొన్ని సూచనలు చేసింది. ఒకవేళ మానసిక సమస్యలు తలెత్తినప్పుడు వాటిని అధిగమించడానికి టివీ చూడడం, సినిమాలు చూడటం, ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపడం పాటూ , వ్యాయామం చేయడం, తరచూ నీళ్లు తాగడం, 8 నుంచి 9 గంటలు నిద్రపోవడం ద్వారా మానసిక సమస్యలు అధిగమించవచ్చు అంటున్నారు.
శారీరక సమస్యలు వస్తే చేతులు వణకడం వంటి సమస్యలకు ఉంటే డాక్టర్‌ని తక్షణం సంప్రదించి సమస్యని చెబుతుంది. సలహాలు పాటిస్తూ సమస్యని అధిగమించాలి అన్నారు. ఇలా చేస్తే ఒక దురలవాటు నుంచి విముక్తి పొందండంతో పాటూ.. ఆరోగ్యంతో జీవించమని ప్రభుత్వం మందు బాబులకు విజ్ఞప్తి చేసింది.
Make use of #lockdown to quit #alcohol, #AndhraPradesh tells #booze lovers.
— P Pavan (@pavanmirror) April 13, 2020
Tips:watch TV, cinema (on TV screen), spend time with family, kids, strain body with physical exercise, gardening &drink water frequently &sleep 8-9 hrs@MumbaiMirror @BangaloreMirror @ahmedabadmirror pic.twitter.com/izY9P5FGyB

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




