మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ తొలగింపు‌పై జగన్ సర్కార్ తుది అఫిడవిట్

మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ తొలగింపు‌పై జగన్ సర్కార్ తుది అఫిడవిట్
x
Nimmagadda Ramesh Kumar(File photo)
Highlights

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ప్రత్యేక ఆర్డినెన్సు ద్వారా ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ప్రత్యేక ఆర్డినెన్సు ద్వారా ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టుల వెళ్ళింది. పదవీకాలం ముగియకుండానే జోవొల ప్రకారం తనను తొలిగించే అధికారం ప్రభత్వానికి లేదని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తుది అఫిడవిట్‌ను ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. ఇప్పటికే ప్రిలిమినరీ కౌంటర్‌ను ప్రభుత్వం దాఖలు చేసింది.

ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ లో కీలక అంశాలు ప్రస్తావించింది. రాష్ట్ర ఎన్నికల సంఘంలో సంస్కరణల్లో భాగంగా కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమించామని ప్రభుత్వం తెలిపింది. రిటైడ్ జడ్జీలను ఎస్ఈసీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా కోర్టుకు వివరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా రూపొందిందించదని కోర్టు దృష్టికి సర్కార్ తీసుకెళ్లింది.

క్షేత్ర స్థాయిలో అవాస్తవాలు తనను కావాలనే ఎస్ఈసీ పదవి నుంచి తప్పించారనే నిమ్మగడ్డ వేసిన పిటిషన్ అవాస్తవమని ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది. అంతేకాదు.. మిగిలిన రాష్ట్రాల్లో ఎస్ఈసీల కాల పరిమితి వివరాలు కూడా ప్రభుత్వం వెల్లడించింది.

2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో 13 జిల్లాల్లో జరిగిన ఎన్నికల హింసకు సంబంధించిన వివరాలను సైతం కోర్టుకు వివరించింది. 2014లో 221 హింసాత్మక ఘటనలు జరిగితే 2020లో 88 ఘటనలు జరిగినట్టు వెల్లడించింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని అఫిడవిట్‌లో పేర్కొంది. పోలీసులు, పరిపాలన యంత్రాంగంపై నిమ్మగడ్డ చేసిన ఆరోపణలు కూడా తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories