ఏపీలో మద్యం విక్రయాల్లో తొలి రోజే రికార్డ్

ఏపీలో మద్యం విక్రయాల్లో తొలి రోజే రికార్డ్
x
Representational Image
Highlights

ఏపీలో రెడ్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం అయ్యాయి.

ఏపీలో రెడ్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. రేట్లు పెంచిన ఉదయం నుంచే షాపుల దగ్గర మందుబాబులు క్యూ లైన్లు కట్టారు. చాలా జిల్లాల్లో తొలిరోజు స్టాక్ మొత్తం ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు సమాచారం.

మద్యం అమ్మకాలు ప్రారంభించిన తొలిరోజు మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.35 కోట్లు నుంచి రూ45 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,468 అధికారిక మద్యం షాపులకుగాను 2,345 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ‌గా 411 మద్యం షాపుల విక్ర‌యాలు ప్రారంభించాయి. రెండో రోజు కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉంది.

మద్యం అమ్మకాలకు సంబంధించి సోమవారం ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, మాస్క్‌ లేనిదే మద్యం దుకాణాల వద్ద వచ్చేందుకు అనుమతి లేదని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories