కరోనా ఎఫెక్ట్‌ : ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

కరోనా ఎఫెక్ట్‌ : ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
x
YS Jagan (File Photo)
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఔట్ పేషంట్(ఓపీ) సేవలు నిలిచిపోయాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఔట్ పేషంట్(ఓపీ) సేవలు నిలిచిపోయాయి.కరోనా రోగులతోనే అన్ని ఆసుపత్రులు నిండిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఓపీ సేవలపై శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.

ఔట్ పేషంట్ సేవలు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఇతర వ్యాధులతో వచ్చే రోగులను చూసేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

సాధారణ రోగుల కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలను కూడా ఏర్పాటు చేయాలని ఆసుపత్రులకు ఆదేశాలిచ్చింది. కాగా, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 386కు చేరింది. అత్యధికంగా కర్నూలులో 82 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి ఆరుగురు మరణించారు. పదిమంది కోలుకున్నారు. గుంటూరు, నెల్లూరు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో కరోనా కేసులు నమోదు కాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories