Training for IIT's and JEE in Governmet Colleges: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కాలేజీల్లోనే ఐఐటీ, జేఈఈలకు శిక్షణ

Training for IITs and JEE in Governmet Colleges: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కాలేజీల్లోనే ఐఐటీ, జేఈఈలకు శిక్షణ
x
students
Highlights

Training for IIT's and JEE in Governmet Colleges: ఇంటర్ విద్యార్థులకు ఇది ఒక వరం లాంటిదనే చెప్పాలి.

Training for IIT's and JEE in Governmet Colleges: ఇంటర్ విద్యార్థులకు ఇది ఒక వరం లాంటిదనే చెప్పాలి. ఎందుకంటే ఇంటర్ వరకు సాఫీగా సాగే విద్యార్థుల చదువులో ఇది పూర్తయిన తర్వాత వారి భవిషత్తుపై కీలక అడుగులు వేయాల్సి ఉంటుంది. ఒక పక్క ఇంజనీర్, మరో పక్క డాక్టర్ ఇతర విద్యలపై కాన్సెంట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇదే సమయాన్ని ప్రైవేటు కాలేజీలు ఆసరాగా తీసుకుంటున్నాయి. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేసి, ఎంసెట్, నీట్, జేఈఈ అంటూ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు చెబుతున్నారు. వచ్చే ఏడాది నుంచి అవే తరగతులను ప్రభుత్వ కాలేజీల్లో చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిపై సీఎం జగన్మోహనరెడ్డి ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చారు.

పాఠశాల విద్య, గోరుముద్ద కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ విద్య అమలు చేయాలన్న ఆయన.. స్కూళ్లలో 8వ తరగతి నుంచే కంప్యూటర్ విద్యను అందించాలన్నారు. అటు విద్యార్ధుల్లో ఇంగ్లీష్ పరిజ్ఞానంపై టోఫెల్ తరహ పరీక్షలను నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు.

ప్రతీ జిల్లాకు టీచర్ల కోసం ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు, వర్చువల్ క్లాస్ రూమ్, ఇంగ్లీష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే హైస్కూల్స్‌లలో లైఫ్ స్కిల్స్, కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. ఇక ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి ఐఐటీ, జేఈఈ లాంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలన్నారు. పోటీ పరీక్షలకు విద్యార్ధులు సన్నద్ధం అయ్యేలా బోధన ఉండాలని సూచించారు. కాగా, మధ్యాహ్న భోజనంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories