వారికి పూర్తి జీతాలు చెల్లిస్తామంటున్న ఏపీ ప్రభుత్వం

వారికి పూర్తి జీతాలు చెల్లిస్తామంటున్న ఏపీ ప్రభుత్వం
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా పరిస్థితిపై ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమీక్షాసమావేశం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా పరిస్థితిపై ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమీక్షాసమావేశం నిర్వహించారు. కరోనా కట్టడి పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యారోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి జీతాలు ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా నియంత్రణ కు పోలీసులు, పారిశుద్ధ్య, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను సీఎం ప్రశంసించారు.

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోబంలో కూరుకుపోయింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ 3 కేటగిరీలకు పూర్తి జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జీతాల్లో కోతపై రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలాఖరులో నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ఇంకా జీతాలు అందలేదు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories