ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వారందరికీ రూ.5వేల సాయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వారందరికీ రూ.5వేల సాయం
x
YS Jagan(file photo)
Highlights

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి లాక్‌డౌన్‌ కారణంతో ఇబ్బందులు పడుతునన అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లు, మౌజంలకు ఆర్థిక సాయం అందించేందుకు జగన్ సర్కార్ ముందుకొచ్చింది.

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి లాక్‌డౌన్‌ కారణంతో ఇబ్బందులు పడుతునన అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లు, మౌజంలకు ఆర్థిక సాయం అందించేందుకు జగన్ సర్కార్ ముందుకొచ్చింది.వారికి 5వేల రూపాయల చొప్పున అందించనుంది. దీనికి సంబంధించి విపత్తు నిర్వహణ శాఖ నుంచి 33.93 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున సంబంధిత శాఖలు, ఆర్థిక సంస్థల ద్వారా అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లు, మౌజంలకు ఐదు వేల రూపాయలు ఇవ్వనుంది. లాక్‌డౌన్‌తో ఆలయాల్లో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. దీంతో దేవుళ్ళ దర్శనాలు భక్తులను ఆలయాలకు అనుమతించడం లేదు. దర్శనాలు నిలిపివేశారు. అర్చకులకు ఆదాయం వచ్చే మార్గం కూడా లేకుండా పోయింది. అంతేకాకుండా పలు మందిరాల్లో కూడా దైవ దర్శనాలు నిలిపివేశారు. సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం మేరకు వరికి 5,000లు గ్రాంట్‌ రూపంలో చెల్లించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31,017 అర్చకులు, 7,000 ఇమాం, మౌజంలు, 29,841 పాస్టర్లు లబ్ధి పొందనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories